మొత్తానికి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి గంటా శ్రీనివాసరావుకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 1..తన పుట్టిన రోజు నాడు గంటా..జగన్ సమక్షంలో వైసీపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే తన అనుచరులకు గంటా క్లియర్ గా చెప్పేశారు. అటు వైసీపీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచిన గంటా…అప్పుడే పార్టీ మారడానికి చూశారు.
అసలు టీడీపీ అధికారం కోల్పోవడమే..గంటా రూట్ మార్చారు..కానీ వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్ లాంటి వారు గంటాని అడ్డుకున్నారు. దీంతో గంటా అలాగే ఉండిపోయారు..అలా అని టీడీపీలో యాక్టివ్ గా లేరు. మధ్యలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామాని స్పీకర్ ఆమోదించలేదు. ఎటు వెళ్లకుండా అలాగే ఉన్న గంటాకు ఇప్పుడు మారుతున్న రాజకీయాల నేపథ్యంలో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో వైసీపీలో చేరడం ఖాయమైంది.
అయితే గంటా వైసీపీలోకి వెళితే..టీడీపీకి నష్టం ఉంటుందా? ఉంటే అది పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే గంటాని తమ్ముళ్ళు ఎప్పుడో లైట్ తీసుకున్నారు. ఆయన పార్టీలో ఉన్న ఒకటే..లేకపోయినా ఒకటే అని అనుకున్నారు. పైగా గంటా వెళ్లిపోవడం వల్ల..టీడీపీలో గ్రూపు తగాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు. కాకపోతే గంటాకు విశాఖ సిటీ, భీమిలి, చోడవరం, అనకాపల్లి లాంటి స్థానాల్లో కాస్త క్యాడర్ ఉంది. ఇప్పుడు ఆ క్యాడర్ వైసీపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది.
అదే సమయంలో వైసీపీలో గంటాని వ్యతిరేకించే వర్గాలు ఉన్నాయి..వారు గాని టీడీపీ-జనసేనల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. పైగా టీడీపీ-జనసేన పొత్తు ఉంటే గంటా ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు. కాబట్టి గంటా వైసీపీలోకి వెళ్ళడం వల్ల టీడీపీకి పెద్ద నష్టమేమీ ఉండదని అంటున్నారు. ఆయన వెళ్ళడం వల్ల టీడీపీకే మంచిందని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.