ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో రచ్చ.. సురేందర్‌కు అడ్వాంటేజ్.!

-

బీఆర్ఎస్ పార్టీలోనే అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు ఎక్కువ అవుతుంది. మామూలుగానే కాంగ్రెస్ లో నేతలు వీధికెక్కి మరీ తిట్టుకుంటారు. దీని వల్ల కాంగ్రెస్ కు బాగా నష్టం జరిగింది. ఇటీవలే కాస్త రచ్చ తగ్గింది. అయితే కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని స్థానాల్లో సీట్ల కోసం నేతలు పోటీపడుతున్నారు. ఇదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పోరు ఎక్కువ నడుస్తుంది.

2008లో ఏర్పడిన ఈ స్థానంలో 2009 నుంచి ఇక్కడ బి‌ఆర్‌ఎస్ హవా నడుస్తుంది. 2009లో బి‌ఆర్‌ఎస్ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి గెలిచారు. 2010 ఉపఎన్నికలో కూడా సత్తా చాటారు. తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. కానీ 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అటు కాంగ్రెస్ నుంచి జజాల సురేందర్ గెలిచారు. అయితే ఈయన నెక్స్ట్ బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. దీంతో ఏనుగుకు ఇబ్బంది వచ్చింది. పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. ఈ క్రమంలో ఏనుగు రవీందర్ ఈటల రాజేందర్ తో కలిసి బి‌జే‌పిలోకి వెళ్ళిపోయారు.

 

అయితే రాష్ట్రంలో బి‌జే‌పి గ్రాఫ్ డౌన్ అవ్వడం.. ఎల్లారెడ్డిలో బి‌జే‌పికి పెద్ద పట్టు లేకపోవడంతో ఈయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ లోకి వస్తే ఆల్రెడీ సీటు కోసం పోటీ పడుతున్న మదన్ మోహన్, వడ్డేపల్లి సుభాష్ రెడ్డిలతో పోటీ పడాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో మదన్.. జహీరాబాద్ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తర్వాత బాన్సువాడపై ఫోకస్ పెట్టారు.

అక్కడ నుంచి ఎల్లారెడ్డికి వచ్చారు. ఇక్కడే కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మదన్‌కు జహీరాబాద్ పార్లమెంట్ సీటు ఇవ్వడానికే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. కానీ ఆయన ఎల్లారెడ్డి సీటు కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు రవీందర్ రెడ్డి వస్తే ఇంకా రచ్చ వస్తుంది. ఇలా సీటు కోసం కాంగ్రెస్ లో కుమ్ములాటలు నడిస్తే..మళ్ళీ ఎల్లారెడ్డిలో సురేందర్ గెలుపు సులువు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news