కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

-

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే రఘునందన్‌రావును కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళ్తున్న కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యతో కిషన్ రెడ్డి వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారి తీరుపై ఆగ్రహం చెందారు. తనను ఎలా అడ్డుకుంటారని పోలీసులను కిషన్‌రెడ్డి నిలదీశారు.

మరోవైపు అనుమతి లేకుండా ఆందోళన చేయవద్దని రాచకొండ సీపీ కిషన్ కిషన్ రెడ్డిని కోరారు. అయినా వినకపోవడంతో కిషన్‌ రెడ్డి, రఘునందన్‌ను అదుపులోకి తీసుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు.

రాష్ఠ్రంలోని పేదల సొంతింటి కలసాకారం చేస్తామన్న బీఆర్ఎస్ సర్కారు…. కోట్లు వెచ్చించి నిర్మించిన రెండుపడక గదుల ఇళ్లను పంపిణి చేయడం లేదంటూ.. రాష్ట్ర బీజేపీ విమర్శించింది. ఆ ఇళ్లను పరిశీలించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారన్న సమాచారంతో ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news