ఉత్తమ నటుడిగా మోడీ, విలన్ గా అమిత్ షాకు ఆస్కార్ అవార్డులు…!

-

లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఆస్కార్ 2020 వేడుకలతో ప్రపంచం మొత్తం ఆస్కార్ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం సరికొత్తగా ఆస్కార్ అవార్డులను ప్రకటించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తమ ట్విట్టర్ ఖాతాలో పలువురికి ఆస్కార్ అవార్డులు ఇచ్చింది. హాస్య పాత్రలో ఉత్తమ నటుడు, యాక్షన్ పాత్రలో ఉత్తమ నటుడు వంటి అవార్డుల ఇచ్చింది.

ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ యొక్క ట్విట్టర్ లో… యాక్షన్ పాత్రలో ఉత్తమ నటుడిగా, కాంగ్రెస్ పార్టీ పిఎం మోడీకి అవార్డు ఇవ్వగా, నామినీలుగా ప్రగ్యా ఠాకూర్ మరియు యోగి ఆదిత్యనాథ్ ని ప్రకటించారు. యాక్షన్ పాత్రలో ఉత్తమ నటుడిగా నామినీలు & విజేతలు చూస్తే, ప్రతి నాయకుడి పాత్రలో ఉత్తమ నటుడిగా, నామినీలుగా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ మరియు అనురాగ్ ఠాకూర్, ఉండగా… ఈ అవార్డును హోంమంత్రి అమిత్ షాకు ఇచ్చారు.

హాస్య పాత్రలో ఉత్తమ నటుడిగా, బిజెపి మంత్రి మనోజ్ తివారీకి అవార్డు ఇచ్చింది. ఈ విభాగంలో ఇతర నామినీలలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఉన్నారు. మనోజ్ తివారీ యోగా ఆసనాలు చేస్తున్న వీడియోను కాంగ్రెస్ పోస్ట్ చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు ఇచ్చారు. ప్రస్తుత౦ దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news