నిన్న రుణం.. ఇవాళ ఉచితం.. ప్రజా కూటమి కుయుక్తులు!

-

ప్రజా కూటమి.. మాయా కూటమి.. మహా కూటమి.. స్వార్థ కూటమి.. పేరు ఏదైనా కానీ.. ఆ పేరుతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు చేసే స్వార్థ రాజకీయాలు తెలంగాణ ప్రజల సాక్షిగా బట్టబయలవుతూనే ఉన్నాయి. రోజూ పేపర్లలో పేజీలకు పేజీలు ప్రకటనలు ఇస్తున్న మహా కూటమి… నిన్న ఇచ్చిన ప్రకటనలో ఇంటి జాగ ఉన్నవాళ్లకు డబుల్ బెడ్ రూం కట్టుకోవడానికి 5 లక్షల రుణం ఇస్తాం అంటూ ప్రకటించింది. అదే.. ఎస్సీ, ఎస్టీ అయితే 6 లక్షల రుణం ఇస్తున్నట్టు తెలిపింది. అయితే.. మహా కూటమి మ్యానిఫెస్టో కంటే ముందు ఇంటి జాగ ఉన్నవాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా 5 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. నిన్న మాట మార్చి తన దుష్ట బుద్ధిని బయటపెట్టింది.

దీనిపై తెలంగాణ వ్యాప్తంగా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ కూడా కాంగ్రెస్ కుటిల బుద్ధిపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కూడా మహా కూటమి కుతంత్రాలపై పటాన్ చెరు సభలో ప్రజలకు వివరించారు. ఇక.. తన తప్పు తెలుసుకొని లపా లపా లెంపలు వేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ ఇచ్చిన ప్రకటనల్లో 5 లక్షలు ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షలు ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటన ఇచ్చింది. అలా తెలంగాణ ప్రజలను ఎలాగైన తమ వైపుకు తిప్పుకొని ఓట్లేయించుకొని తెలంగాణలో అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ అండ్ కో.

ఇదే పథకాన్ని సీఎం కేసీఆర్ ఏనాడో ప్రకటించారు. ఇంటి జాగ ఉన్నవాళ్లకు 5 లక్షలు ఉచితంగా ఇవ్వనున్నట్టు సీఎం ప్రకటించారు. అర్బన్ ఏరియాలో ఉన్నవాళ్లకు ఆరున్నర లక్షలు ఇవ్వనున్నట్టు సీఎం ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ పథకాన్ని కాపీ కొట్టి.. కాంగ్రెస్ కూడా అదే పథకాన్ని తన మ్యానిఫెస్టోలో పెట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version