దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్య ప్రజల నుండి రాజకీయ నాయకుల వరకు అందరు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ వైరస్ కారణంగా చాల మంది నాయకులు కోల్పోయాము. మరికొంత మంది నాయకులు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి చేరుకొన్నారు. అయితే ఈ వైరస్ ఎప్పుడు ఎవరి దగ్గరి నుండి వస్తుందో తెలియడం లేదు. దీంతో వ్యాక్సిన్ వచ్చే వరకు అధికారులు మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా మరో ప్రజాప్రతినిధి కరోనా బారినపడ్డాడు.
కేరళ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వీ.ఎస్. సునీల్‌కుమార్ కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. వైద్యుల సూచనల మేరకు ఆయన క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అంతేకాక తన వ్యక్తిగత సహాయక సిబ్బందిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా మంత్రి కోరారు. ఇక కేరళలో ఆర్థికశాఖ మంత్రి టి.ఎం. థామస్ ఇసాక్, పరిశ్రమలశాఖ మంత్రి ఇ.పి.జయరాజన్ తాజాగా సునీల్ కుమార్ ఈ మహమ్మారి బారిన పడ్డారు.