ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ దెబ్బకు దాదాపు అన్ని దేశాలు కూడా ప్రజలను రక్షించుకోవడానికి కాస్త కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాలు కరోనా పై యుద్ధం ప్రకటించాయి. ఎక్కడా కూడా కరోనాకు అవకాశం ఇవ్వొద్దని భావిస్తున్న రాష్ట్రాల ప్రజల విషయంలో కాస్త కఠినం గానే వ్యవహరిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా వైరస్ భయపెడుతుంది.
నెల్లూరులో కరోనా వైరస్… వ్యాప్తితో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇది పక్కన పెడితే ఈ వైరస్ ఏపీ సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో భయపెడుతుంది. ఇప్పటికే అక్కడ ఒక వృద్దుడు ప్రాణాలు కోల్పోయారు. ఒక గూగుల్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కర్ణాటక సరిహద్దుల్లోనే ఉంటుంది.
అక్కడి ప్రజలు బెంగళూరు వెళ్లి పూల వ్యాపారం చేస్తూ ఉంటారు. దీనితో కరోనా భయం వారిని వెంటాడుతుంది. కరోనా వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో అక్కడి ప్రజలు కర్ణాటక వెళ్ళడం లేదు. జలుబు జ్వరం ఉన్న వాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి పరిక్షల కోసం ఇతర ప్రాంతాలకు వస్తున్నారు. దీనితో ఏపీ ప్రభుత్వం కూడా ఆ నియోజకవర్గం మీద ఎక్కువగా దృష్టి పెట్టి అక్కడి ప్రజలను అలెర్ట్ చేస్తుంది.