రాజకీయాల్లో ఒక్కో పార్టీది ఒక్కో స్టయిల్.. వామపక్ష పార్టీలు మాత్రం ప్రజల పక్షాన పోరాడతాయని పేరుంది.. సీపీఎం, సీపీఐ నేతలు కేంద్ర రాష్ట ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తుంటారు.. అయితే నీత్యం ఉద్యమాలతో బిజిగా ఉండే సీపీఐలో నేతల మధ్య సమన్వయం లోపించందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమం సాక్షిగా ఈ వ్యవహారం బయటపడింది..
సీపీఐ కేంద్ర కమిటీకి, తెలంగాణ కమిటీకి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల హర్యానా గర్నవర్ దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి వెళ్లే ప్రసక్తే లేదని సీపీఐ కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.. ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి కేంద్ర ప్రభుత్యమే కారణమని.. అందుకే దత్తాత్రేయ నిర్వహించే కార్యక్రమంలో హాజరుకాబోమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు.. ఇంత వరకూ బాగానే ఉన్నా..
నారాయణ ఇచ్చిన స్టేట్మెంట్ తో తనకు సంబంధం లేదన్నట్లుగా.. సీపీఐ పార్టీ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే ఇప్పుడు సీపీఐ పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. సీపీఐ రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీలకు వేర్వేరు అభిప్రాయాలు ఉంటున్నాయా అన్న సందేహం మొదలైంది. ఒకే పార్టీలో ఢిల్లీ నాయకత్వం ఒకలాగా, తెలంగాణ నాయకత్వం మరోలా వ్యవహరిస్తున్నాయన్న చర్చ తెలంగాణ సీపీఐలో నడుస్తోంది.
ఆలయ్ బలయ్ కు వెళ్లిన సాంబశివరావ్.. దత్తాత్రేయను పొగడ్తలతో ముంచెత్తడంతో కామ్రేడ్స్ పార్టీలో ఏం జరుగుతోందన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి.. నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయా..లేదంటే సమన్వయ లోపామా..అన్న అనుమానాలు తలెత్తుతున్నాయట. సమన్వయం లోపంతోనే ఇది జరిగిందని.. పార్టీ నేతలు చెబుతున్నా.. అసలైన కారణం ఏదో ఉందనే ప్రచారం జరుగుతోంది.. చాలా సందర్బాల్లో కూడా సీపీఐ నేతలు భిన్నమైన స్వరాలను వినిపిస్తున్నారు.. మొత్తంగా అలయ్ బలయ్ కార్యక్రమంలో సీపీఐలో తాజా చర్చలకు దారి తీస్తోంది..