హైదరాబాద్ మహానగర పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణలు చేపట్టినా, ప్రభుత్వ భూములను ఎవరైనా అన్యాయంగా ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు.ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామన్నారు. ముఖ్యంగా అక్రమార్కులపై హైడ్రా ఫోకస్ పెట్టిందని ఆయన గుర్తుచేశారు.చెరువు భూములు, బఫర్ జోన్లలో నిర్మాణమైన ఆక్రమ కట్టడాల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, హైడ్రా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకువెళ్తుందన్నారు.
ఇకమీదట ఎవరైనా ప్రభుత్వ స్థలాల జోలికి వస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి చెరువునకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను తెప్పించుకుని, గూగుల్ మ్యాప్ ఆధారంగా సర్వేలు చేయనున్నట్లు వెల్లడించారు. దీని ఆధారంగా ఆక్రమణదారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.చర్యల తీసుకునే విషయంలో హైడ్రా ఎవరికి లొంగదని, కఠినంగా వ్యవహరిస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.