ప్రస్తుతం తెలంగాణ రాజీకయాలు హుజూరాబాద్ వేదికగా జరుగుతున్నాయి. తాను నిలబెట్టిన ఒకప్పటి టీఆర్ ఎస్ పార్టీ నేతలే ఇప్పుడు ఆయనకు చెక్ పెట్టేందుకు తెగ శ్రమిస్తున్నారు. ఒకప్పుడు ఆయనకు సన్నిహితులుగా మెలిగిన నేతలే ప్రస్తుతం ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా చల్లా ధర్మారెడ్డి అందరికంటే ఎక్కువగానే కష్టపడుతున్నాడు.
ఆయన పరకాల ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ పక్కనే ఉన్న కమలాపూర్‌కు తానే ఎమ్మెల్యే అన్నట్టు అన్నీ చూసుకుంటున్నారు. అన్ అఫీషియల్ గా పాలన సాగిస్తున్నారు. ఏది కావాలన్నా ఆయనే సాంక్షన్ చేయిస్తున్నాడు. కమలాపూర్ నేతలందరినీ తనవైపు తిప్పుకుంటున్నాడు.
ఈటల వెంట ఎవరూ నడవకుండా చూస్తూ పార్టీకి బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన పరకాల కంటే కమలాపూర్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే కమలాపూర్ నుంచి ఒకప్పుడు రెండుసార్లు ఈటల గెలిచారు. ఇక్కడ బలమైన పట్టున్న ఈటలకు ఎదుర్కోవాలంటే ఆ మాత్రం శ్రమించాల్సిందే. హుజూరాబాద్ ఎన్నికల్లో కమలాపూర్ అత్యంత కీలకమైన మండలం. మరి ఈటల గాలికి ధర్మారెడ్డి నిలబడతాడా లేదా అన్నది చూడాలి.