నాలుగు శాతం చావులకి అమెరికన్లు సిద్ధం అయిపోయారా ??

-

ప్రపంచాన్ని గడగడలాడించిన అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ దెబ్బకి విలవిలలాడుతోంది. వైరస్ కి మందు లేకపోవడంతో పాటుగా అమెరికా దేశంలో వాతావరణం వైరస్ బలపడటానికి బాగా సహాయం చేస్తుంది. దీంతో ప్రపంచంలోనే ఎక్కువ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదు అయ్యాయి. పైగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రజలను అప్రమత్తం చేసి లాక్ డౌన్ విధించే విషయంలో చాలా మొండిగా వ్యవహరించడం జరిగింది. దీంతో ఇప్పుడు కరోనా వైరస్ మరణాల విషయంలో అమెరికా.. ఇటలీ దేశాన్ని దాటేసింది. అమెరికాలో కరోనా వైరస్ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిందని అంతర్జాతీయ మీడియాలో షాకింగ్ వార్తలు వస్తున్నాయి.అమెరికా దేశంలో ఐదు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు ఉంటే.. దాదాపు 20 వేలకుపైగా మరణాల సంఖ్య ఉంది. కొన్ని వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు అమెరికా దేశంలో రోజు నమోదవుతున్నాయి. మరోపక్క అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ సంవత్సరంలో జరగబోతున్న తరుణంలో డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ వ్యవహారంలో అనుసరిస్తున్న తీరుపై విమర్శలు తీవ్ర స్థాయిలో వినబడుతున్నాయి. లాక్ డౌన్ విధిస్తే తప్పేం ఉంది అంటూ ట్రంప్ పై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

కనీస వైద్య సదుపాయం మరియు పరికరాలు కూడా సరిపోని పరిస్థితి అమెరికాలో ఉంది. ముఖ్యంగా న్యూయార్క్ మరియు న్యూజెర్సీ వంటి ప్రాంతాలలో వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. దీంతో వైద్యులు ఎక్కువగా ఎమర్జెన్సీ కేసులను టేకప్ చేస్తూ మిగతా వారిని లైట్ తీసుకుంటున్నారు. రోజురోజుకి అమెరికాలో కరోనా బలపడుతుంది. ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న పరిస్థితి బట్టి చూస్తే నాలుగు శాతం అమెరికన్లు చనిపోయే పరిస్థితి ఉందని లెక్కలు చెబుతున్నాయి. అయినా కానీ అక్కడ ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడం తో అమెరికన్లు కరోనా వైరస్ వల్ల చనిపోవడానికి సిద్ధమై పోయారా అన్న కామెంట్లు అంతర్జాతీయస్థాయిలో వినబడుతున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version