ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 24 మంది మంత్రులు కాసేపటి క్రితం రాజీనామా చేశారు. ఈ రోజు కేబినేట్ సమావేశం తర్వాత 24 మంది మంత్రులు ముక్కుమ్మడిగా రాజీనామా చేశారు. మంత్రులు అందరూ కూడా తమ రాజీనామా లేఖలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేసిన మంత్రులను ఉద్ధేశించి.. వారి అనుభవాన్ని చూసి తొలి విడతలో మంత్రి పదవులు ఇచ్చామని అన్నారు.
ఇప్పుడు వారందరూ రాజీనామా చేయడంతో కొత్త వారికి అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కోసం అద్భుతంగా పని చేశారని అన్నారు. ఇక నుంచి పార్టీ కోసం తమ సమయాన్ని కేటాయించాలని కోరారు. అనుభవాన్ని బట్టి పార్టీ జిల్లాల బాధ్యతలు అప్పగిస్తామని ప్రకటించారు. నేటి వరకు ప్రభుత్వాన్ని ముందు ఉండి నడిపించినట్టు.. పార్టీని కూడా ముందుకు నడింపించాలని సూచించారు. త్వరలోనే రాజీనామాలు చేసిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు.