అధికార పార్టీ వైసీపీ నాయకురాలు రోజా ప్రతిపక్ష పార్టీ టీడీపీ నాయకురాలు దివ్యవాణి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి మీడియా ముందు వ్యవహరిస్తున్న తిరు వారి డైలాగులు మాటలు విని జనం ఇదెక్కడి గొడవండీ బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పైన విమర్శలు చేయడానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన టిడిపి నాయకులను రంగంలోకి దిగే వాళ్ళు. ఈ నేపథ్యంలో జగన్ అధికారంలోకి వచ్చాక సేమ్ అదే ఫార్ములా చంద్రబాబుపై ఉపయోగిస్తున్నారు.
చంద్రబాబుని విమర్శించడానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులను మీడియా ముందు వదులుతున్నారు. అయితే ఇటువంటి తరుణంలో చంద్రబాబు మహిళా నాయకులను మీడియా ముందు పెట్టి కౌంటర్ వేస్తున్న తరుణంలో జగన్ కూడా ఫైర్ బ్రాండ్ రోజా ని రంగంలోకి దింపారు. విషయంలోకి వెళితే తెలుగుదేశం పార్టీ నాయకురాలు సినీనటి దివ్యవాణి ఇటీవల మీడియా ముందు చాలా యాక్టివ్ అయ్యింది. రాజధాని అమరావతి గొడవ సమయంలో టిడిపి పార్టీ తరపున ధర్నాలో పాల్గొని పోలీసులకు చుక్కలు చూపించింది.
దీంతో చంద్రబాబు దివ్యవాణి కి టిడిపి పార్టీ తరపున మీడియా స్పోక్స్ పర్సన్ గా పదవీ బాధ్యతలు ఇవ్వటంతో వైసిపి పార్టీ నేతలను గత కొన్ని రోజుల నుండి ఏకిపారేస్తున్నారు. దీంతో దివ్యవాణి కి పోటీగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఫైర్ బ్రాండ్ వైసిపి పార్టీ నాయకురాలు రోజా ని రంగంలోకి దింపారు. అటు వైపు టిడిపి తరపున దివ్యవాణి ఇటువైపు వైసీపీ తరపున రోజా ఇద్దరికిద్దరు విమర్శలు దారుణంగా చేసుకుంటున్నారు. రోజా భజన కార్యక్రమాలు మేకప్ వంటివి ఆపి ప్రజా సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లాలని దివ్యవాణి రోజా కి సూచించారు. ఇదే తరుణంలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా దివ్యవాణి చేస్తున్న కామెంట్లకు కౌంటర్ లు ఇస్తున్నారు. దీంతో వీరిద్దరి గొడవ మీడియాలో చూస్తున్న ప్రజలు ఇదెక్కడి గొడవండీ బాబు అంటూ తెగ కామెంట్ చేస్తున్నారు.