BREAKING : రేపు తెలంగాణలో వ్యాక్సినేషన్ కు బ్రేక్

-

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాక్సినేషన్ పక్రియ విజయవంతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు… వందల సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ లను ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే విజయవంతంగా సాగుతున్న ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకు రేపు బ్రేక్ పడనుంది. రేపు దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో వాక్సినేషన్ ప్రక్రియకు సెలవు ప్రకటించిన తెలంగాణ ఆరోగ్యశాఖ.

వైద్య సిబ్బంది విజ్ఞప్తుల మేరకు రేపటి రోజున వ్యాక్సినేషన్ కు సెలవు ప్రకటించింది ఆరోగ్యశాఖ. ఎల్లుండి నుంచి తిరిగి యధా విధంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ఆరోగ్య శాఖ.

కాగా తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కేవలం 167 కరుణ కేసులు నమోదయ్యాయి. అలాగే నిన్న కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు. అదే సమయంలో 207 మంది పూర్తిస్థాయిలో కరుణ మహమ్మారి నుంచి కోరుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3933 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version