బీఆర్ఎస్ పార్టీకి విరాళంగా పంటనిచ్చిన రైతులు

-

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిని ప్రకటించారు. దేశ్ కీ నేత కేసీఆర్ వెన్నంటే ఉంటామని ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నాయకులు ముందుకొస్తున్నారు. బీఆర్ఎస్ కు పలు రాష్ట్రాల నుంచి మద్దతు పెరుగుతోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ కు పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాల ద్వారా లబ్ధి పొందిన వారు బీఆర్ఎస్ కు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది రైతులు, కూలీలు తమ పంట మొత్తాన్ని బీఆర్ఎస్ పార్టీకి విరాళంగా ప్రకటించారు.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కే గ్రామానికి చెందిన దళితబస్తీ వాసులు తాము పండించిన సోయా పంట మొత్తానికి వచ్చే రూ. 66,000లను బీఆర్ఎస్‎కు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తే దేశంలో తమలాంటి ఎన్నో కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా ఉండి ఆదుకుంటారని అన్నారు.  గ్రామానికి చెందిన 33 మంది దళిత కుటుంబాలకు 99 ఎకరాల భూమి దళితబంధు పథకం కింద ఇచ్చారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news