ఆంధ్రప్రదేశ్ అధికార౦ కోల్పోయిన తర్వాత రాజకీయంగా ఇబ్బంది పడుతున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కాస్త గడ్డు కాలమే నడుస్తుంది. చంద్రబాబు 40 ఏళ్ళ అనుభవంలో ఊహించని విధంగా చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఆయన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు మీద ఒక అభిప్రాయం ఎక్కువగా ఉండేది. ఆయనను కోర్ట్ కి లాగడం కష్టమని.
అయితే ఇప్పుడు మాత్రం అది జరిగే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయని అంటున్నారు. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు మీద దూకుడు పెంచింది. ఆయన పార్టీ నేతల మీద, అది కూడా ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలను లక్ష్యంగా చేసుకుని గురువారం ఐటి అధికారులు సోదాలు చేసారు. కేంద్ర బలగాల పహారాలో ఈ దాడులు జరిగాయి.
ఈ దాడులు ఎక్కువగా జరిగింది చంద్రబాబు సన్నిహితుల మీదే ఎక్కువగా జరిగాయి. దీనితో చంద్రబాబులో ఇప్పుడు భయం మొదలైందని అంటున్నారు. ఇన్నాళ్ళు జగన్ ని అవినీతి పరుడు అని ఆరోపించిన చంద్రబాబు, ఇప్పుడు ఇరుక్కునే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. త్వరలో ఆయనపై ఐటి దాడులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
దీనితో ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడు లేని విధంగా కంగారుగా కనపడుతున్నారని, ఏదో జరగబోతుంది అనే ఆందోళన ఆయనలో కనపడుతుందని అంటున్నారు. ఏదైనా తేడా వస్తే తాను జైలుకి వెళ్ళినా ఆశ్చర్యం లేకపోలేదు అనే భావన చంద్రబాబులో కనపడుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆయనపై పెట్టే అవకాశం ఉందనే కంగారు కూడా చంద్రబాబులో ఉందని అంటున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.