ములుగు పోరు: సీతక్క కు ఎదురులేనట్లేనా?

-

 ఎమ్మెల్యే సీతక్క..ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలు. ప్రజలకు సేవ చేయడంలో ముందుండే సీతక్క…అధికార పక్షంపై పోరాటం చేయడంలో ఎప్పుడు ముందే ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలుగా ఉన్న సీతక్క…టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కుడి భుజం మాదిరిగా నడుచుకుంటున్నారు. అయితే ఇలా కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలుగా ఉన్న సీతక్క…తన సొంత నియోజకవర్గం ములుగులో ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబరుస్తున్నారా? నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆమెకు తిరుగుండదా? అనే విషయాలని చూసుకుంటే…ఎమ్మెల్యేగా సీతక్క ఎలా పనిచేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

కాకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటం వల్ల అనుకున్న మేర నిధులు రావడం గానీ, పనులు జరగడం గానీ అవ్వడం లేదు. కానీ సీతక్క సాధ్యమైన మేర పనులు చేస్తున్నారు. కాకపోతే ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో సీతక్క ఎప్పుడూ ముందే ఉంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకురాలుగా ఉన్నారు. అయితే సీతక్కకు ప్రత్యర్ధిగా అజ్మీరా చందులాల్ ఉన్నారు. ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది.

చందులాల్ కూడా టి‌డి‌పిలో పనిచేసి వచ్చిన నాయకుడే. గతంలో టి‌డి‌పి తరుపున రెండుసార్లు ములుగు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ఎంపీగా కూడా పనిచేశారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2014 ఎన్నికల్లో చందులాల్ టి‌ఆర్‌ఎస్ తరుపున బరిలో దిగి విజయం సాధించారు. అటు సీతక్క టి‌డి‌పి తరుపున పోటీ చేసి ఓడిపోయారు.

సీతక్క 2004లో టి‌డి‌పి తరుపున పోటీ చేసి ఓడిపోగా, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు..మళ్ళీ 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత సీతక్క కాంగ్రెస్‌లోకి వెళ్ళి 2018 ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ నుంచి నిలబడిన చందులాల్‌పై విజయం సాధించారు. అయితే నెక్స్ట్ కూడా ఈ ఇద్దరు మధ్యే వార్ జరిగేలా కనిపిస్తోంది. ఇక్కడ బి‌జే‌పికి పెద్దగా బలం లేదు కాబట్టి, కాంగ్రెస్-టి‌ఆర్‌ఎస్‌ల మధ్యే పోరు జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయాలని చూస్తే సీతక్క స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version