తెలంగాణాలో ఐపిఎస్ లకు విలువ లేదు: మాజీ ఐపిఎస్ సంచలన వ్యాఖ్యలు

-

బంగారు తెలంగాణలో మంచి పోలీస్ అధికారులకు విలువ లేదు అని ఐపిఎస్ అధికారులను పట్టించుకోవడం లేదని మాజీ ఐపిఎస్ అధికారి వీకే సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా ప్రభుత్వంపై దుమ్మేత్తిపోశారు. తెలంగాణ అవినీతిలో రెండో స్థానంలో ఉంది అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిత్యం వేదిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడుతాను అని ఆయన పేర్కొన్నారు.

మాజీ పోలీస్ అధికారులకు మంచి మంచి పదవులు ఇస్తున్నారు అని మండిపడ్డారు. కీలకశాఖలకు అధికారులు లేరు అని, తెలంగాణ ఆర్టీసీ మునిగిపోతుంది అని ఆయన విమర్శించారు. సీనియర్ అధికారులు పోస్టింగ్ ల కోసం ఎదురుచూస్తున్నారు అని ఆయన అన్నారు. చాలా మంది నిజాయితీ అధికారులు మౌనంగా ఉన్నారు అని ఆరోపించారు. తెలంగాణ లో కుటుంబ పాలన నడుస్తోందన్నారు.

బంగారు తెలంగాణ కంగారు తెలంగాణ గా మారింది అని, ప్రభుత్వానికి నేను అనేక లేఖలు రాశాను అని వెల్లడించారు. కానీ అభివృద్ధిపై ప్రభుత్వం స్పదించలేదు అని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎలా గెలవాలనేదే ప్రభుత్వం ప్రియారిటీ అని పేర్కొన్నారు. ఎన్నికల ముందే ప్రభుత్వం నిరుద్యోగులకు పథకాలు తీసుకొస్తుంది అని, ఆత్మహత్యలు చేసుకుని సాధించిన తెలంగాణ లో యువతకు అన్యాయం జరుగుతుంది అన్నారు. తెలంగాణ ను విడిచి వెళ్లను ఇక్కడే ఉండి ప్రజల తరపున పోరాడుతాను అన్నారు ఆయన. నాకు సీఎంతో విభేధాలు లేవు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news