చివరికి గల్లా కూడానా.. టీడీపీ గుడ్‌బై ?

-

తెలుగుదేశం పార్టీ లో గల్లా జయదేవ్ కీలక నేత అన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ లో ముఖ్య నేతల్లో ఒకరైన గల్లా జయదేవ్ ఇప్పుడు టీడీపీని వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీ ని వీడి పోతున్న విషయం తెలిసిందే. గంటా శ్రీనివాసరావు,సుజనా,టీజీ వెంకటేష్ వంటి కీలక నేతలు ఆ పార్టీని వీడి వెళ్లిపోతుండగా ఇప్పుడు తాజాగా గల్లా జయదేవ్ కూడా పార్టీ ని వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో అసలు ఏపీలో ప్రతిపక్ష హోదా లో ఉన్న టీడీపీ పరిస్థితి ఏంటి అనేది పెద్ద ప్రశ్నర్ధకంగా మారనుంది. పార్టీ లో కీలక నేతగా వ్యవహరిస్తున్న గల్లా పార్టీ కి వీడ్కోలు పలుకనున్నట్లు తెలుస్తుంది. మార్చిలోనే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం గత ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ ప్రభుత్వం ఏపీలో ప్రతిపక్ష పార్టీ గా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే పార్టీ ఓటమి పాలైన సమయంలో కూడా పార్టీకి తోడుగా నిలిచిన వారు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తుండడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుండగా, తాజాగా గల్లా జయదేవ్ కూడా అదే బాట పడుతుండడం పార్టీ కి జీర్ణించుకోలేని అంశం అని చెప్పాలి. ఇక గల్లా కూడా రాజీనామా చేస్తే ఏపీ లో టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటా అని ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి లోక్ సభలో ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒకరు గల్లా జయదేవ్ అనే విషయం తెలిసిందే. ఆయన పార్టీ కి ముఖ్య నేత మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడుకు కూడా బాగా దగ్గర మనిషి అనే ప్రచారం ఉంది. అయితే వీరు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు.

జయదేవ్ తల్లి గల్లా అరుణకుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే జయదేవ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యింది మాత్రం తెలుగుదేశం లోనే – ఎంపీ అయ్యిందీ టీడీపీలోనే. ఎంపీ హోదాలో చంద్రబాబు నాయుడుకు బాగా దగ్గరయ్యారు గల్లా జయదేవ్. ఈ క్రమంలో గల్లా రాజీనామా చేస్తే అసలు పార్టీ పరిస్థితి ఏంటి అనేది తెలియడంలేదు. దీనిపై అధినేత బాబు ఎలా స్పందిస్తారో అన్న విషయం కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజారిటీ తో గల్లా జయదేవ్ ఎంపీ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు గల్లా టీడీపీ కి రాజీనామా చేస్తే బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news