హైదరాబాద్ కి గంభీర్, సహా ప్రముఖులు… బిజెపి బాగానే వాడుతుంది…!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను చాలా కీలకంగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రచారం కోసం ప్రముఖులను వాడుకోవాలి అని భావిస్తుంది. నేటి నుంచి బిజెపి ప్రచారం మొదలు పెడుతుంది. హైదరాబాద్ లో బీజేపీ తరుపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కుష్భూ, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్, యువ నేత, ఎంపీ తేజస్వీ సూర్య ప్రచారం చేసే అవకాశం ఉంది.

కేంద్రమంత్రులు ప్రకాష్ జావడేకర్, స్మ్రతీ ఇరానీ తదితరులు రోడ్ షో లు నిర్వహిస్తారని బిజెపి ప్రకటించింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరుపున పది మంది స్టార్ క్యాంపైనర్స్ రంగంలోకి దిగుతున్నారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రఘునందనరావు, రాజసింగ్ తెరాస విమర్శలను ఎదుర్కోవడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తారు. సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మురళీదరరావు, వివేక్, గరికపాటి మోహనరావు ఇంటింటి ప్రచారం చేస్తారు.