బ్రేకింగ్‌ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు…!

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చెయ్యాల్సిందే… ఇప్పుడు విపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తున్న డిమాండ్ ఇది. స్థానిక సంస్థల ఎన్నికలకు మా అభ్యర్ధులను పోటీ చేయనివ్వడం లేదు, నామినేషన్ వేయనివ్వలేదు, హింసకు అధికార పార్టీ పాల్పడింది అంటూ ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు… స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.

తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. 7 దశాబ్దాలు పైగా ఉన్న స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా కనీ-వినీ ఎరుగని దౌర్జన్యాలు, హింసా సంఘటనలు, మహిళలపై దాడులు, ప్రతిపక్షాల మీద దాడులు, ప్రజాప్రతినిధుల కార్లు ధ్వంసం చేయటం, 75 ఏళ్ల వృద్ధుడు నామినేషన్ వేయడానికి వెళ్తుంటే అతనిపై దాడి, రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కొన్ని వందల సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.

వాలంటీర్లు పెన్షన్లు – ఇళ్ల స్థలాల కూపన్‌లు ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధులకు ఓటేయాలని కోరుతున్నారు, దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. జగన్ సహకారంతో ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ స్పందించి రాష్ట్రంలో ఏకగ్రీవం జరిగిన నామినేషన్ వెయ్యకుండా అడ్డుపడ్డ స్థానాలను రద్దు చేయాలి, ఈసీ ఎన్నికలను రద్దు చేయాలి, రీషెడ్యూల్ చేసి మళ్లీ ఎన్నికల ప్రకటన చేయాలి, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news