హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో టైమింగ్స్ పెంపు

హైదరాబాద్ మహానగరంలోని ప్రయాణికులకు… మెట్రో యాజమాన్యం తీపి కబురు అందించింది. రోజువారీ మెట్రో ట్రైన్ టైమింగ్స్ లో లో కీలక మార్పులు చేసింది మెట్రో యాజమాన్యం. మొన్నటి వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల 15 నిమిషాల వరకు మెట్రో రైలు నగరంలో నడిచేవి. అయితే ప్రయాణికుల రద్దీ మరియు కరోనా మహమ్మారి తగ్గుదల నేపథ్యంలో ఆ టైమింగ్స్ ను మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది మెట్రో యాజమాన్యం.

Metro
Metro

ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల 15 నిమిషాల వరకు మెట్రో రైళ్ళ నడపాలని… నిర్ణయం తీసుకుని మెట్రో. ఈ మారిన టైమింగ్స్ ను… రేపటి నుంచి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది మెట్రో యాజమాన్యం. దీంతో రేపటి నుంచి… మారిన టైమింగ్స్ ప్రకారం మెట్రో రైలు నగరంలో అనడం ఉన్నాయి. దీంతో… హైదరాబాద్ నగరవాసులకు కాస్త ఊరట లభించే అవకాశం ఉంటుంది. కాగా మొన్నటి  వరకు కరోనా నేపథ్యం లో  మెట్రో ట్రైన్స్ బంద్ అయిన సంగతి తెలిసిందే.