ప్రకాష్ రాజ్ కు షాక్ : ప్యానల్ నుంచి బయటికొచ్చిన బండ్ల గణేష్

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మా అసోసియేషన్ ఎన్నికలపైనే దృష్టిసారించారు. అయితే తాజాగా.. మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ నిర్మాత బండ్ల గణేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మా అధ్యక్ష అసోసియేషన్ ఎన్నికల బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటికి వచ్చారు బండ్ల గణేష్. ఈమేరకు సంచలన ప్రకటన చేశారు బండ్ల గణేష్. తాను జనరల్ సెక్రటరీ గా పోటీ చేస్తానని ప్రకటించారు బండ్ల గణేష్.

ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు బండ్ల గణేష్. “మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు-నన్ను పోటీ చెయ్ అంటోంది -అందుకే ఈ పోటీ. అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకే ఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా …” అంటూ సంచలన ట్వీట్ చేశారు బండ్ల గణేష్. దీంతో ‘మా’ ఎన్నికల ప్యానెల్ లో మరోసారి విబేధాలు బయట పడ్డాయి. అసలు ‘మా’ ప్యానల్ నుంచి బండ్ల ఎందుకు బయటికొచ్చారు ? ప్రకాశారాజ్ తో గొడవేంటి..? అనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.