సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్

-

దేశంలో కరోనా వైరస్ శర వేగంగా వ్యాపిస్తుంది. సామాన్య ప్రజల నుండి రాజకీయ నాయకుల వరకు అందరు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ వైరస్ కారణంగా చాల మంది నాయకులు కోల్పోయాము. మరికొంత మంది నాయకులు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి చేరుకొన్నారు. అయితే ఈ వైరస్ ఎప్పుడు ఎవరి దగ్గరి నుండి వస్తుందో తెలియడం లేదు. దీంతో వ్యాక్సిన్ వచ్చే వరకు అధికారులు మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు.

dattatreya
dattatreya

ఇక రాజ్‌భ‌వ‌న్‌లో ఏడీసీ అధికారికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేల‌డంతో ద‌త్తాత్రేయ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అన్ని అపాయింట్‌మెంట్ల‌ను ఆయ‌న ర‌ద్దు చేసుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శి రాకేశ్ క‌న్వ‌ర్‌తో పాటు ఏడీసీ సిబ్బంది మొత్తాన్ని క్వారెంటైన్ చేశారు. ఆరోగ్య‌శాఖ సిబ్బంది వారంద‌రికీ కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వహించారు. ఇక హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 12,899కి చేరుకున్న‌ది.

Read more RELATED
Recommended to you

Latest news