కాళేశ్వరం, దొడ్డు వడ్లపై కేంద్రం పెత్తనం ఏంటో తేల్చేందుకే సీఎం ఢిల్లీ టూర్- హరీష్ రావు

-

కాళేశ్వరం ప్రాజెక్ట్, దొడ్డు వడ్ల కొనుగోలుపై కేంద్ర పెత్తనం చేయాలని చూస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రంపై మండిపడ్డారు. వీటిపై కేంద్రం పెత్తనం ఏంటో తేల్చేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారాని హరీషరావు అన్నారు. సిద్ధిపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్రం దొడ్డు వడ్లను కొనుగోలు చేయనని తెలిపింది. దీంతో రాష్ట్రంలో వరి రైతులు ఆందోళనకు గురిఅవుతున్నారు. రాష్ట్రంలో చాలా వరకు అన్ని జిల్లాల్లో రైతులు చాలా వరకు దొడ్డు వడ్లనే సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో వరి రైతులు కలవరానికి గురవుతున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా విషయంలో కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వకపోవమే కాకుండా పెత్తనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. వ్యవసాయంలో మంచి లాభాల కోసం పామాయిల్ పంటను సాగు చేయాలని కోరారు. దీంతో పాటు కుల వ్రుత్తులకు పూర్వవైభవం తేవాలని సీఎం క్రుషి చేస్తున్నారని హరీష్రావు అన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version