ఈటల రాజేందర్, మంత్రి హరీశ్‌రావును అత్యంత సన్నిహితమైన బంధం. ఉద్యమ కాలం నుంచి వీరు ఒకరినొకరు సపోర్టు చేస్తూ ఎదిగారు. ఎన్నో విషయాల్లో వీరిద్దరూ కలిసే నిర్ణయాలు తీసుకునేవారు. సీఎం కేసీఆర్‌కు వీరిద్దరూ కుడి, ఎడమ భుజాలుగా మెలిగారు. ఈటలకు ఏ కష్టం వచ్చినా తానున్నాననే ధైర్యం ఇచ్చేవారు హరీశ్‌రావు. అలాగే ఈటల కూడా హరీశ్‌రావకు వెన్నంటే ఉండేవాడు.
అలాంటి సన్నిహితుడైన హరీశ్‌రావుపై ఈటలకు ఎంతో నమ్మకం ఉంది. మొన్న ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ కూడా హరీశ్‌రావు తనకు అత్యంత సన్నిహితుడని, అలాంటి వ్యక్తిని హుజూరాబాద్‌కు ఇన్ చార్జిగా నియమించారని కొంత బాధపడ్డారు.
ఈటలకు హరీశ్‌రావుపై ఎంతోకొంత నమ్మకం ఉండేది. డైరెక్ట్‌గా కాకపోయినా ఇన్ డైరెక్ట్‌గా అయినా సపోర్టు చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు హరీశ్‌రావు ఏకంగా హుజూరాబాద్ రాజకీయాల్లో వేగంగాచక్రం తిప్పుతున్నారు. నిన్న కమలాపూర్ నేతలతో మీటింగ్ పెట్టి వారు టీఆర్ ఎస్ వెంట నడిచేలా చేశారు. ఇంకా కొందరితో కూడా చర్చలు జరపుతారు. మరి పార్టీ నిర్ణయానికి కట్టుబడి హరీశ్‌రావు నిజంగానే ఈటలను ఒంటరి చేస్తాడేమో చూడాలి.