మున్సిపల్ ఎన్నికలపై హైకోర్ట్ షాక్…!

-

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల నేపధ్యంలో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం వరకు ఏ విధమైన ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఇటీవల పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిని పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్ట్,

ఎన్నికల నియమావళిని తనముందు ఉంచాలని ఈసీని ఆదేశాలు జరీ చేస్తూ, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం రేపు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్న నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలు ఇవ్వడంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఆసక్తి నెలకొంది.

ఇక ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించి ఎలా అయినా సరే విపక్షాలకు కళ్ళెం వెయ్యాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టుదలగా ఉన్నారు. ఇటీవల పార్టీ సమావేశం నిర్వహించిన ఆయన మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఒక్క సీటు పోయినా సరే మంత్రుల పదవులు పోతాయని కెసిఆర్ వారిని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news