హైకోర్ట్ vs ఏపీ ప్రభుత్వం :  అలవాటు అయిపోయిందా ? అవగాహనా రాహిత్యమా ?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల కంటే ఎక్కువగా న్యాయస్థానాలలో అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. చాలా గొప్పగా మీడియా ముందు తీసుకున్న నిర్ణయం గురించి చెప్పినా గానీ అమలు విషయంలో వచ్చేసరికి చాలా వరకు నీరుగారిపోయాయి జగన్ నిర్ణయాలు. తాజాగా ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవాలని జగన్ తీసుకొన్న నిర్ణయం పట్ల హైకోర్ట్ ఏపీ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఈ విషయంలో జగన్ సర్కారు ఇచ్చిన 81, 85 జీవోలను కొట్టిపారేసింది.TDP may move court over Andhra government plan for three state ...మామూలుగా అయితే పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యావిధానాన్ని ఎవరు వ్యతిరేకించారు. ప్రస్తుత ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం విధానం కంపల్సరీ. అయినా గాని…అటువంటి ఆలోచన జనం నెత్తిపై బలంగా రుద్దాలని ఇంగ్లీష్ మీడియం మాత్రమే చదవాలని జగన్ జీవో ఇవ్వటం పట్ల హైకోర్టు సీరియస్ అయ్యింది. విద్యార్థులు ఏ మీడియం చదువుకోవాలో వాళ్ళకే స్వేచ్ఛ ఇవ్వాలని..ఈ విషయంలో తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవించాలని తెలిపింది. దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కలు చూపించి నట్లయింది. ఇన్నిసార్లు  న్యాయస్థానాలలో తీసుకుంటున్న నిర్ణయాలు ఫెయిల్ అవుతున్నా గాని జగన్ వైఖరిలో మార్పు రాదు అని చాలామంది మండిపడుతున్నారు.

 

నిర్ణయాలు తీసుకునే సమయంలో అమలు చేసే సమయంలో ఇలాంటి విషయాలు కోర్టు దాకా వెళ్తే ఏం జరుగుతుంది అన్న దాని గురించి జగన్ ఆలోచించారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చిన ఈ తీర్పుపై వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు పార్టీ హైకమాండ్ అవగాహన రాహిత్యం వల్ల న్యాయస్థానంలో నిర్ణయాలు ఫెయిల్ అవుతున్నాయని లోలోపల చర్చించుకుంటున్నారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తే ఇలానే ఉంటుంది అంటూ మరికొంతమంది వైసిపి హైకమాండ్ మీద విమర్శలు చేస్తున్నారు. జీవోలు ఇచ్చే విషయంలో అవగాహన లేకపోతే ఇలాగే ఉంటుంది అంటూ మరికొంతమంది జగన్ ప్రభుత్వం పై సెటైర్లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news