ఆంధ్రాలో హైటెన్షన్, ఎం జరుగుతుంది…?

-

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు విషయంలో దాదాపు నెల రోజుల నుంచి ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. జగన్ ప్రకటన చేసిన తర్వాత వచ్చిన కమిటి నివేదికలు సహా అన్ని విధాలుగాను రాజధాని మార్పు విషయంలో తనకు సానుకూలంగా ఉండటంతో ముఖ్యమంత్రి జగన్ కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. బోస్టన్ నివేదిక, జిఎన్ రావు నివేదిక అన్ని కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటే రాజధానిని నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నేడు సమావేశమవుతుంది. ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు పేర్నినాని, మోపిదేవి వెంకట రమణ, మేకపాటి సుచరిత, బొత్స, ఆదిమూలపు సురేష్, కన్నబాబు, డీజీజీ గౌతమ్ సవాంగ్, కొడాలినాని, అజయ్ కల్లం, గౌతమ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ హైపవర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ నీలం సాహ్ని కమిటీ కన్వీనర్‌గా ఉన్నారు. సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశం జరగనుంది. ముందు వచ్చిన జీఎన్‌రావు కమిటీ నివేదిక పాటు బోస్టన్ కమిటీ అధ్యయనాలపై హైవపర్ చర్చిస్తుంది. ఈ నేపధ్యంలోనే అసలు కమిటి ఏ నిర్ణయం తీసుకుంటుందా అనేది చర్చనీయంశంగా మారింది. రాజధానిని మార్చాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నేపధ్యంలో హైపవర్ కమిటి ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఇప్పటికే అమరావతిని రాజధానిగా మార్చోద్దని కోరుతూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులు నిరసనలు ఆందోళనలతో ఆ ప్రాంతం హోరెత్తిపోతుంది. ఇప్పుడు కమిటి రాజధానిని మార్చాలని నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అనే ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news