హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మహిళా నేత.. రేవంత్‌కు ట‌చ్‌లోనే..

-

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకుగాను సమావేశమయ్యారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరిని బరిలో దించాలి? అనే అంశాలపై నేతలతో సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ ఓ జిల్లాకు చెందిన కీలక మహిళా నేతను బరిలో దింపాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు? అనే విషయం తెలియాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

హుజురాబాద్ బై ఎలక్షన్ బరిలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉండబోతున్నారనేది ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే టికెట్ ఇవ్వబోతున్నట్లు పింక్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇకపోతే బీజేపీ తరఫున బలమైన అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు. త్వరలో ఆయన మళ్లీ పాదయాత్రను షురూ చేయబోతన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక కీలకం, కష్టమైనదనే చెప్పొచ్చు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, కేడర్‌ను ఇప్పటికే అధికార గులాబీ పార్టీ తన గూటికి చేర్చుకుంది.

పాడి కౌశిక్‌రెడ్డి, స్వర్గం రవి ఇతర నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ బలహీనమైంది. అయితే, రేవంత్ ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అభ్యర్థిగా మహిళా నేత ఫిక్స్ చేశారని సమాచారం. ఆమె ఎవరో కాదు ఓరుగల్లు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న కొండా సురేఖ. ఈమెను కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ అభ్యర్థిగా బరిలో దించడం ద్వారా శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని అనుకుంటున్నారట రేవంత్. ఇందుకు సురేఖ్ ఒప్పుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news