బీజేపీకి రైతుల‌పై ప్రేమ ఉంటే ఎరువుల ధ‌ర త‌గ్గించాలి : ఎమ్మెల్సీ ప‌ల్ల‌

రాష్ట్ర బీజేపీకి రైతులపై ప్రేమ ఉంటే.. ఎరువ‌ల ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ లేఖ రాయాల‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్ల రాజేశ్వ‌ర్ రెడ్డి అన్నారు. ఎప్పుడూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బండి సంజ‌య్ ఆరోపించడం కాకుండా రైతుల పక్షాన ఉండాల‌ని అన్నారు. అలాగే బండి సంజ‌య్ మాట‌లు తిన్న‌గా రాని అని అన్నారు. రాష్ట్ర రైతులు క‌ళ్లు తెరిస్తే.. బ‌స్మం అవుతావ‌ని బండి సంజ‌య్ ను హెచ్చ‌రించారు. కేసీఆర్ ను ట‌చ్ చేస్తే.. రాష్ట్రం మొత్తం బ‌గ్గు మంటుంద‌ని అన్నారు.

అలాగే రైతు బంధు వంటి గొప్ప ప‌థ‌కాల‌ను సృష్టించి రైతుల బాగు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని అన్నారు. కానీ కేంద్ర ప్ర‌భుత్వం రైతుల న‌డ్డి విరిచే విధంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆగ్ర‌హించారు. ఎరువుల ధ‌ర‌ల‌ను పెంచ‌డం తో పాటు వ్య‌వ‌సాయానికి ఉప‌యోగ‌ప‌డే యంత్రాల‌కు డీజిల్ అంద‌కుండా విప‌రీతంగా ధ‌ర‌లు పెంచార‌ని ఆరోపించారు. అలాగే అంత‌ర్జాతీయంగా క్ర‌డూ ఆయిల్ ధ‌ర త‌గ్గినా.. మ‌న దేశంలో పెట్రోల్ డిజిల్ ధ‌ర‌లు త‌గ్గించ లేద‌ని మండిప‌డ్డారు. అలాగే వ్య‌వ‌సాయ క్షేత్రాల వ‌ద్ద మీట‌ర్లు బిగించి రైతుల‌ను నిలువు దోపిడి చేయాల‌ని కుట్ర చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. దేశ వ్యాప్తంగా బీజేపీని రైతులు వ్య‌తిరేకిస్తున్నార‌ని అన్నారు.