బాయిల్డ్ రైస్ విష‌యం లో మెడ మీద కత్తి పెట్టి రాయించారు – సీఎం కేసీఆర్

-

బాయిల్డ్ రైస్ ను సేక‌రించ వ‌ద్ద ని రాష్ట్ర ప్ర‌భుత్వం మెడ పై క‌త్తి పెట్టి సంత‌కం పెట్టించార‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఒక గింజ కూడా కొనుగోలు చేయ‌మ‌ని చెప్పింద‌ని అన్నారు. ఇటీవ‌ల తామ బృందం కూడా ఢిల్లీ వెల్లిన‌ప్పుడు కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ కూడా ఇదే విష‌యం చెప్పార‌ని అన్నారు. కానీ తెలంగాణ లో యాసంగి లో బాయిల్డ్ రైస్ మాత్రమే పండుతుంద‌ని అన్నారు.

యాసంగి స‌మ‌యం లో ఎండ లు ఎక్కువ గా ఉండ‌టం వ‌ల్ల బాయిల్డ్ రైస్ మాత్ర‌మే వ‌స్తుంద‌ని అన్నారు. బాయిల్డ్ రైస్ కాకుండా మాములు రైస్ గా చేస్తే ఎండ ప్ర‌భావం తో నూక అవుతుంద‌ని అన్నారు. ఈ విష‌యాన్ని తెలంగాణ రాష్ట్రం లో ఉన్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వానికి చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉండి రాష్ట్ర ప్ర‌భుత్వం పై విమ‌ర్శలు చేయ‌డం కాదు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ లో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాల‌ని కోరాల‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version