మరో నెలలో డెలివరీకి సిద్దమయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒన్ !

-

అమెరికా అధ్యక్షుడు తరహాలో భారత్ ప్రధానికి, రాష్ట్రపతికి, ఉప రాష్ట్రపతికి కలిపి రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒన్ విమానాలు ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ. 8,458 కోట్లతో రెండు విమానాలకు భారత్ బోయింగ్ సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి విదేశీ పర్యటనలకు ఇక నుంచి ఈ ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలే వాడనున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో అమెరికా ఆధ్యక్షుడు మాత్రమే ఉపయోగిస్తున్న అత్యంత అధునాతనమైన శక్తివంతమైన విమానం ఎయిర్ ఫోర్స్ వన్ కి ఏమాత్రం తీసిపోకుండా ఈ రెండు విమానాలు సిద్దం కానున్నాయి.

వచ్చే నెలలో ఒక విమానం డెలివరీ కానున్నట్టు తెలుస్తోంది. ఎయిర్‌ఫోర్స్ పైలట్లు మాత్రమే నడిపే ఈ విమానానికి “ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వన్‌”గా పేరు పెట్టారు. ఆకాశంలో ఎగురుతున్న ఈ కోటలాంటి విమానం చాలా సురక్షితం, శత్రు దుర్భేధ్యమని చెబుతున్నారు. ఇక ఈ విమానంలో అత్యంత ఆధునిక, సురక్షితమైన ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఉంటుంది. దీని ద్వారా, ప్రధాని మోడీ ప్రపంచంలోని ఏ మూలనున్న వ్యక్తితోనైనా మాట్లాడగలరు. ఈ సంభాషణను టాప్ చేయడం అసాధ్యం. ఇక ఈ రెండు విమానాల ధర సుమారు రూ. 8,458 కోట్లని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news