సీఎం వార్నింగ్: ఆలోచించి ట్వీట్ చేయి నాగబాబు!

-

పదిమంది నేరస్థులు తప్పించుకున్నా పర్లేదు కానీ.. ఒక నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదు! ఈ విషయం గౌరవనీయులైన నాగబాబు గారికి తెలియకపోవచ్చు! అదేవిధంగా… ఎన్నికల్లో కొందరు నేతలు డబ్బులు పంచుతారు.. మందు పంపిణీ చేస్తారు! అది కొందరు ఓటర్లు తీసుకుంటారు! పంచిన నేతలది ఎంత తప్పో.. తీసుకున్న ఓటర్లదీ అంతే తప్పు! అంతమాత్రాన్న నేరం మొత్తం ఒటర్లదే అంటే ఎలా? ప్రస్తుతం నాగబాబు చెబుతున్న మాటలు ఇవే!!

ఓటు నోటు బాగా పనిచేసింది.. డబ్బులకు ప్రజలు అమ్ముడు పోవడం వల్లే తాను ఓడిపోయాను.. అని గతంలో పవన్ కల్యాణ్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ మాటలు చెప్పే ముందు… అసలు తమను ప్రజలు ఎందుకు నమ్మాలి.. ఓటు ఎందుకు వేయాలి.. అని ఆలోచించుకోకపోవడం ఏమిటో! తాజాగా నాగబాబు కూడా అలానే స్పందించారు అనే కామెంట్లు పడుతున్నాయి.

“రాష్ట్రంలో అభివృద్ది లేదు, కష్టం వస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం, అని నిందించే హక్కు రెండు వేలు తీసుకుని ఓటు వేసిన నీకు లేదు…! అని తాజాగా నాగబాబు ట్వీట్ చేశారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… ప్రతీ ఓటరూ డబ్బు తీసుకునే ఒటు వేశాడనే భావన్ కరెక్ట్ కాదనే కామెంట్లు బలంగా పడుతున్నాయి.

ఇంతకీ నాగబాబు ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో ప్రజలంతా రెండు వేల రూపాయలకు కక్కుర్తి పడి ఓటు వేసినట్టేనా? జనసేన నేతలు గెలవకపోతే అందరూ నోట్లకు అమ్ముడుపోయినట్టేనా? డబ్బుల విషయాలు కదా… సామాన్యుడికంటే ఎక్కువగా ఉన్న నాగబాబు & కో లకే తెలియాలి… డబ్బు అంత పవర్ ఫుల్ అని!!

ఇక రాష్ట్రంలో అభివృద్ది లేదని, ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. పాపం నాగబాబు… ఎప్పుడూ షో లే కాదు.. ఆప్పుడప్పుడూ న్యూస్ చూడాలి.. సామాన్యులతో సంభాషించాలి.. నవరత్నాల ఫలితాలు కనాలి అని పలువురు ఈ సందర్భంగా కోరుకుంటున్నారు! ఏది ఏమైనా… “నీతికి అవినీతికి తేడా తెలియకపోవడం నాగబాబుకు అవమానం” అని ఆన్ లైన్ లో కామెంట్లు పడటం ఈ సందర్భంగా గమనార్హం!

ఫైనల్ గా… కొంతమంది ఓటర్లు డబ్బులు తీసుకుని ఓట్లు వేసి ఉంటే వేసి ఉండొచ్చు… అంతమాత్రాన్న ఓటు వేసినవారంతా నోటు తీసుకున్నారనే మాటలు మాట్లాడితే “తాట తీస్తా” అని అంటున్నాడు సామాన్యుడు (సీఎం – కామన్ మ్యాన్)!

Read more RELATED
Recommended to you

Latest news