హత్రాస్ రేప్ పై సుప్రీం చీఫ్ జస్టీస్ ఆసక్తికర వ్యాఖ్యలు…!

-

హత్రాస్ గ్యాంగ్‌ రేప్ కేసుపై సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలు అయిన పిటీషన్ ని సుప్రీం కోర్ట్ విచారిస్తుంది. ఈ పిటిషన్‌ను సిజెఐ ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణస్తోంది. సిజెఐ బొబ్డే పిటీషనర్ తరుపు న్యాయవాదిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మీరు విచారణను బదిలీ చేయమని లేదా దర్యాప్తును బదిలీ చేయమని అడుగుతున్నారా? ఈ సంఘటన చాలా అసాధారణమైనది, అలాగే ఆశ్చర్యకరమైనది అన్నారు.

అందుకే మేము మీ మాట వింటున్నామని స్పష్టం చేసారు. అలాగే ఇది షాకింగ్ కేసు కాదని మేము చెప్పడం లేదని… లేదా ఈ కేసులో మీ ప్రమేయాన్ని మేము అభినందించడం లేదని అన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. నిరసనలు కూడా దేశంలో జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news