చినబాబు బయటకు వస్తే ఒక సమస్య.. రాకపోతే మరో సమస్య!

-

కొంతమంది అదృష్టం ఏమిటో కానీ వారు బంగారం పట్టుకున్నా అది మట్టైపోతుంటుంది! ప్రస్తుతం చినబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన అన్న రేంజ్ లో జిల్లాలు తిరిగేస్తున్నారు.. వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతూ యాత్రలు చేపట్టారు. అయితే ఇప్పుడు ఆ పర్యటనలు కూడా టీడీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి!

నిన్నమొన్నటివరకూ కరోనా పేరుచెప్పి ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న చినబాబు నారా లోకేష్… కరోనా కాస్త తగ్గుముఖం పట్టేసరికి.. అమరావతి 300 రోజులకు సంబందించి బయటకు వచ్చారు. ఆ జిల్లా ఈ జిల్లా అంటూ తిరుగుతున్నారు. అయితే ఈ క్రమంలో తాజాగా అనంతపురంలో పర్యటించేసరికి.. అక్కడ వర్గ విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి.. ఫలితంగా కొత్త రచ్చ మొదలైంది!

అనంతపురంలో జేసీ ఫ్యామీలికి గత కొంతకాలంగా తెగ విలువ ఇచ్చేస్తున్నాంటూ.. ఎంతోకాలంగా పార్టీలో ఉన్న సీనియర్లు బాబు & చినబాబు దగ్గర వాపోతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పరిటాల ఫ్యామీలీతోపాటు కాల్వ శ్రీనివాసులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.

అయితే చినబాబు తాజా పర్యటనలో కూడా ఇలాంటి విషయాలు ఫుల్ గా బయటకు వచ్చాయి. చినబాబు మొత్తం జేసీ ఫ్యామీలీ జనాలతోనే తిరగడం.. వారు కాస్త మిగిలినవారిని దగ్గరకు రానివ్వకుండా చేయడంతో.. సీనియర్ టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. 2014 వరకూ కాంగ్రెస్ లో ఉండి టీడీపీని అణిచివేసిన జేసీ కుటుంబానికి లోకేష్ అత్యంత ప్రాధాన్యతం ఇవ్వడంపై అలిగిన పెద్దలు కొందరు.. ఇది మళ్లీ కంటిన్యూ అయితే పార్టీనుంచి వైదొలుగుతామంటూ కూడా మాట్లాడేవరకూ వెళ్లింది వ్యవహారం!

దీంతో… తలలు పట్టుకున్న సీనియర్లు… చినబాబు బయటకు వస్తే ఒక సమస్య రాకపోతే మరో సమస్య… ఇదేమి కర్మరా దేవుడా అంటూ ఫీలవుతున్నారంట!!

Read more RELATED
Recommended to you

Latest news