లిస్ట్‌లో మార్పు..కేసీఆర్ ప్లాన్ ఏంటి?

-

బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులని మళ్ళీ మారుస్తున్నారా? 115 మందిలో కనీసం 20 మందిని మారుస్తారా? ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేని నేపథ్యంలో కే‌సి‌ఆర్ కొంతమంది అభ్యర్ధులని మార్చడానికి రెడీ అవుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి వాటిల్లో వాస్తవం ఉందా? అంటే దాదాపు వాస్తవం లేదనే చెప్పవచ్చు. అందరికంటే ముందు కే‌సి‌ఆర్ 115 మంది అభ్యర్ధులని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇంకో 4 సీట్లలో అభ్యర్ధులని ప్రకటించాలి. ఇటు కాంగ్రెస్, బి‌జే‌పిలు ఇంకా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలోనే ఉంది. కానీ వారి కంటే బి‌ఆర్‌ఎస్ ముందుంది. అయితే కేంద్రం జమిలి ఎన్నికలు లేదా కనీసం లోక్ సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తుందని ప్రచారం వస్తుంది. ఎలాగో లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లేదా మే లో జరగనున్నాయి. వాటితో పాటే ఈ డిసెంబర్ లోపు ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, మిజోరాం ఎన్నికలని సైతం లోక్ సభ ఎన్నికలతో పాటు నిర్వహిస్తారని ప్రచారం ఉంది.

ఎన్నికలు వెనక్కి వెళితే కే‌సి‌ఆర్ కొంతమంది అభ్యర్ధులని మారుస్తున్నారని ప్రచారం ఉంది. ఇప్పటికే అభ్యర్ధులని ఫిక్స్ చేయడం వల్ల కొందరిపై వ్యతిరేకత వస్తుంది. కొందరు ఏమో సీట్లు రాక వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో మరి నెగిటివ్ అవుతుందని చెప్పి కే‌సి‌ఆర్ కొన్ని సీట్లలో అభ్యర్ధులని మారుస్తారని కథనాలు వస్తున్నాయి.

కానీ వీటిల్లో వాస్తవం లేదని చెప్పవచ్చు. దాదాపు ముందు ప్రకటించిన లిస్ట్ లో మార్పులు లేవనే అంటున్నారు. అయితే మైనంపల్లి హనుమంతరావు లాంటి వారు పార్టీ మారితే..ఆ సీటులో ఏమైనా మార్పు రావచ్చు తప్ప దాదాపు లిస్ట్ మాత్రం చేంజ్ కాదనే చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version