టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఈ రోజు చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ నెల 29 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ ఎంపీ లు లేవనెత్తాల్సిన అంశాల పై చర్చించారు. ముఖ్యం గా ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన వరదలను జాతీయ విపత్తు గా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ఎంపీ లకు చంద్రబాబు సూచించాడు.
అలాగే మూడు రాజధానుల బిల్లు, పెట్రో ధరలు, ప్రత్యేక హోదా తో పాటు మొత్తంగా 8 అంశాల పై పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాలని తీర్మాణం చేశారు. పంచాయతీ లకు 15 వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధుల గురించి లేవనెత్తాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఉపాధి హామీ నిధుల మళ్లింపు పై కూడా మాట్లాడాలని ఎంపీ లకు చంద్ర బాబు సూచించాడు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీసీ లకు జరుగుతున్న అన్యాయం గురించి పార్లమెంట్ లో ప్రస్తావించాలని అన్నాడు. అలాగే డ్రగ్స్, గంజాయి హెరాయిన్ వంటి మాధక ద్రవ్యాల నియంత్రణ అంశం పై కూడా చర్చించాలని సూచించాడు.