ఇండియా లో ఇద్ద‌రు ఓమిక్రాన్ అనుమానితులు

-

కరోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తుంది. అయితే తాజా గా ఈ ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ ఇండియా లో ప్ర‌వేశించిన‌ట్టు అనుమానిస్తున్నారు. ద‌క్షిణ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన ఇద్ద‌రికి కరోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చింది. అయితే ఈ ఇద్ద‌రికి క‌రోనా కొత్త వేరియంట్ అయిన ఓమిక్రాన్ ఉంద‌ని వైద్య అధికారులు అనుమానిస్తున్నారు. కాగ ఈ ఇద్ద‌రు కర్నట‌క రాష్ట్రంలోని బెంగ‌ళూర్ కెంపె గౌడ ఎయిర్ పోర్టు కు వ‌చ్చారు.

వీరికి కరోనా నిర్ధార‌ణ ప‌రీక్ష లు నిర్వ‌హించారు. దీని లో వీరికి పాజిటివ్ వ‌చ్చింది. ఓమిక్రాన్ వేరియంట్ అయి ఉంటుంద‌ని ఈ ఇద్ద‌రిని ప్ర‌త్యేకంగా ఒక హోట‌ల్ లో క్వారైంట‌న్ లో ఉంచారు. ఈ ఇద్దరి నుంచి కూడా శాంపిల్స్ త‌సుకుని ఓమిక్రాన్ నిర్ధార‌ణ కోసం ముంబై న‌గ‌రానికి పంపించారు. కాగ ఈ ఫ‌లితాలు 48 గంట‌ల‌లో రానున్నాయి. కాగ ఈ ఘ‌ట‌న తో క‌ర్నాట‌క ముఖ్య మంత్రి బొమ్మై అప్ర‌మ‌త్తం అయ్యాడు. వెంట‌నే అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశాడు. కాగ ఓమిక్రాన్ వేరియంట్ సౌత్ ఆఫ్రికా లో విల‌య‌తాండ‌వం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news