ఈ శాఖలు అసలు మోడీకి నచ్చడం లేదా…? ఆ మంత్రి ఇబ్బంది పెడుతున్నారా…?

Join Our Community
follow manalokam on social media

త్వరలో కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇప్పుడు సీరియస్ గా ఉండవచ్చు అని అంటున్నారు. క్యాబినెట్ లో కొంత మంది మంత్రులను పక్కన పెట్టే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో పాటుగా పరిశ్రమల శాఖ విషయంలో కూడా ప్రధానమంత్రి సీరియస్గా ఉన్నారు అంటున్నారు.

అదే విధంగా జలవనరుల శాఖ విషయంలో కూడా ప్రధాన మంత్రి కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సరిహద్దు రాష్ట్రాలతో జల వనరుల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. వీటిని పరిష్కరించే విషయంలో కూడా కేంద్ర మంత్రి జోక్యం చేసుకోవడం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో జల వనరుల విషయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి.

కేరళ, తమిళనాడు కి మధ్య కూడా ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అలాగే తమిళనాడు కర్నాటక లలో కూడా ఈ గొడవలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య… ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య… ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో కూడా కేంద్ర మంత్రి కారణంగా సమస్యలు తీవ్రమవుతున్నాయి అని ఆవేదన వ్యక్తం అవుతుంది. అందుకే ఇప్పుడు ఈ శాఖల విషయంలో ప్రధానమంత్రి కఠినంగా ముందుకు వెళ్లొచ్చని అంటున్నారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...