రానున్న రోజుల్లో కేంద్రంలో జగన్ కీ రోల్ పోషించనున్నారా? ఆయన ఎవరికి మద్ధతు ఇస్తే…వారే అధికారంలోకి వస్తారా? అంటే ప్రస్తుతం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నట్లు చూసుకుంటే..అదే జరుగుతుందని చెప్పాలి. ఇటీవల కేంద్రంలో కాంగ్రెస్ తో సహ పలు విపక్షాలు కలిసి ఒక కూటమిలో ఏర్పాటు అయ్యాయి. ఎలాగైనా బిజేపిని గద్దె దింపాలని చూస్తున్నాయి. ఇటు విపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ అధికారం చేపట్టాలని బిజేపి..తమ మిత్రపక్షాలతో మీటింగ్‌కు రెడీ అయింది. దాదాపు 30 పార్టీలకు ఎన్డీయే మీటింగ్‌కు ఆహ్వానం పలికింది.
ఇటు ఎన్డీయే, అటు యూపీఏ ..ఇలా ఎవరికి వారు నెక్స్ట్ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అయితే ఏ కూటమిలో కూడా వైసీపీ లేదు. ఆహ్వానం రాలేదు. న్యూట్రల్ గా ఉంది. దీంతో ఈ సారి వైసీపీ మద్ధతుతోనే కేంద్రంలో ఏ ప్రభుత్వమైన ఏర్పాటు అవుతుందని సాయిరెడ్డి అంటున్నారు. అవును ఆయన అన్న మాటలు నిజమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీకి 25 ఎంపీ సీట్లకు 22 వచ్చాయి. అయితే కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ 272 దాటేసి 300కి పైనే బిజేపి గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.
అటు మిత్రపక్షాలని కలుపుకుంటే ఆ మెజారిటీ మరింత పెద్దది. దీంతో వైసీపీ అవసరం బిజేపికి రాలేదు. కానీ తప్పనిసరి పరిస్తితుల్లో రాష్ట్రం కోసం వైసీపీ..అవసరమైనప్పుడు బిజేపికి మద్ధతు ఇస్తుంది. అయితే ఈ సారి కేంద్రంలో ఏ పార్టీ కూడా సొంత మెజారిటీతో అధికారంలోకి రావడం కష్టమని తెలుస్తుంది. ఇటు ఏపీలో వైసీపీ ఎలాగో 24-25 ఎంపీ సీట్లు గెల్చుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. పోనీ అన్నీ సీట్లు కాకపోయినా మళ్ళీ 22 ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చు. ఆ ఎంపీ సీట్ల మద్ధతుతోనే కేంద్రంలో ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాల్సి ఉంటుంది. అంటే నెక్స్ట్ కేంద్రంలో కూడా జగన్ చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయి.