వరుస వివాదాల్లో ఉన్న ఏపీ సర్కారును మరో వివాదం కదిపికుదిపేయనుంది. ఇప్పటికే సారా మరణాలు మరోవైపు పన్నుల వసూళ్లలో క్షేత్ర స్థాయి సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.వీటికి తోడుగా తాజాగా ఇంటర్ బోర్డులో చోటు చేసుకున్న ఓ అవినీతి భాగోతం ఇప్పుడు సంచలనంగా మారనుంది.
ప్రాథమిక సమాచారం అనుసారం ప్రాక్టికల్ , థియరీ పరీక్షల జవాబు పత్రాలు దిద్దేటప్పుడు అధ్యాపకులకు చెల్లించాల్సిన పారితోషకాలకు చెందిన మొత్తాలను పక్కదోవ పట్టాయని తెలుస్తోంది.ఇంటర్ బోర్డు పరిధిలో పనిచేసే ఓ పొరుగు సేవల ఉద్యోగిని నిర్వాకం కారణంగా యాభై లక్షల రూపాయల నిధులు దారి మళ్లాయని స్పష్టం అవుతోంది.దీంతో అధికారులు రంగంలోకి దిగి శాఖ పరమైన చర్యలకు ఉపక్రమించారు. నిధులు పక్కదోవ పట్టడం వాస్తవమేనని, అధ్యాపకులకు చెల్లించాల్సిన డబ్బులు ఏ ప్రయివేటు బ్యాంకు ఖాతాకు తరలిపోయాయని ఉన్నతాధికారులు గుర్తించారు అని ప్రధాన మీడియా చెబుతోంది.