నమ్ముకున్నవాళ్ల విషయం లో జగన్ పర్ఫెక్ట్ గా ఉంటాడు అని మళ్ళీ మళ్ళీ నిరూపితం అయ్యింది!

2019 ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కావడానికి ఎంతో కృషి చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేసిన కీలక వ్యక్తి రిషి పెళ్లికి జగన్ లక్నో వెళ్లారు. నమ్ముకున్న వాళ్ళ విషయంలో జగన్ పర్ఫెక్ట్ అని అనటంలో మళ్లీ నిరూపించాడు. రాజకీయంగా వైసీపీ పార్టీ డౌన్ ఫాల్ అయిన సందర్భంలో వెంటనే జగన్….ప్రశాంత్ కిషోర్ తో చేతులు కలిపి పని చేయడంతో వైసిపి పార్టీ గ్రాఫ్ మొత్తం పెరిగిపోయింది. జగన్ పాదయాత్ర స్టార్టింగ్ అయిన నాటి నుండి ప్రశాంత్ కిషోర్ వైసీపీ పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించారు. అటువంటి ప్రశాంత్ కిషోర్ టీం లో కీలక సభ్యుడు రిషి.Image result for ys jagan pk team member wedding

చాలా సందర్భాలలో ప్రశాంత్ కిషోర్ బిజీ అయిన తరుణం లో రిషి…జగన్ కి చాలా సలహాలు మరియు సూచనలు ఇచ్చేవారట.  దీంతో తన విషయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పెళ్లి కావడంతో జగన్ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన భార్య భారతితో కలిసి లక్నోలో రిషి పెళ్లికి హాజరయ్యారు. తన విజయంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో గతంలోనే ప్రశాంత్ కిషోర్ టీమ్ లో పని చేసిన బ్రహ్మానంద పాత్ర అనే మరో వ్యక్తికి.. ఏపీ చీఫ్ డిజిటల్ డైరక్టర్‌గా పదవి కూడా ఇచ్చారు.

 

అయితే తాజాగా ఈ పెళ్లి వేడుకకు వెళ్ళటంతో కష్టాల సమయంలో తన వెనుక ఉన్న వారిని మర్చిపోయే నాయకుడు కాదు జగన్ అంటూ వైసీపీ నేతలు తాజాగా ఈ విషయం పై కామెంట్ చేస్తున్నారు. మరోపక్క జగన్ రావడంతో పీకే టీం కూడా లక్నోలో ఫుల్ హ్యాపీగా ఉంది. ఏది ఏమైనా నమ్ముకున్నవాళ్ల విషయం లో జగన్ పర్ఫెక్ట్ అని అనటానికి ఇదొక నిదర్శనం అని మరి కొంతమంది అంటున్నారు.