జగన్ రెండు మాటలు మాట్లాడుతున్నారా…?

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వారం రోజుల నుంచి చాలా వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచం తో పోటీ పడే పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అనేది వాస్తవం. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారే అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. వాళ్ళ నుంచే రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా సోకింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కట్టడి అయింది అనుకున్న కరోనా ఇప్పుడు వాళ్ళ నుంచి తీవ్రంగా విస్తరిస్తుంది.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది అని అర్ధమవుతుంది. ఇప్పుడు వాళ్ళను పట్టుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉంది. వాళ్ళు కావాలనే కొన్ని చోట్ల బయటకు రావడం లేదు అనేది కూడా అర్ధమవుతుంది. అలాంటి సమయంలో జగన్ వాళ్ళను పొగిడి తప్పు చేసారని అంటున్నారు. వాళ్ళు కావాలని బయటకు రావడం లేదని దేశం మొత్తం తిడుతుంది.

కాని జగన్ మాత్రం అది ఒక సహజ సంఘటన గా పోల్చారు. అన్ని చోట్లా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని దాని గురించి ఒకరిని నిందించడం భావ్యం కాదని అన్నారు. ఆయన మాట్లాడిన రెండు నిమిషాలే అయినా సరే ఈ ప్రసంగం పై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ప్రధానితో జగన్ మాట్లాడిన సందర్భంలో వారి నుంచే కరోనా వచ్చింది అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో జగన్ ఇలాగే వ్యవహరించారు.

పార్లమెంట్ లో దానికి వైసీపీ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు మాత్రం వాళ్ళ తప్పు లేదు ఇలాంటివి జరుగుతూ ఉంటాయని అన్నారు. మరో పక్కన ఏమో ముస్లిం లను బలవంతంగా క్వారంటైన్ సెంటర్లకు తర్రలిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. జగన్ రెండు మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదని, ముస్లిం వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news