రైతు చ‌ట్టాల‌కు జై కొట్టి ! ఇప్పుడు ఉద్య‌మమా – రేవంత్ రెడ్డి

రైతు సాగు చ‌ట్టాల‌ను పార్ల‌మెంట్ స‌భ‌లలో బిల్లు ప్ర‌వేశ పెట్టిన నాడు టీఆర్ఎస్ ఎంపీ లు మ‌ద్ధ‌త్తు ఇవ్వ‌లేద అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించాడు. పార్లమెంటు లో సాగు చ‌ట్టాల‌కు మ‌ద్ద‌త్తు తెలిపి ఇప్పుడు రైతు ఉద్య‌మాల‌కు మ‌ద్ద‌త్తు ఇవ్వ‌డం ఎంట‌ని రేవంత్ రెడ్డి అన్నాడు.

అలాగే సాగు చట్టాల‌కు వ్య‌తిరేకంగా చేసిన ఉద్య‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది రైతులు చ‌నిపోతే ఒక సారి అయినా.. రైతులను ప‌ర‌మార్శించావా అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించాడు. అలాగే ఢిల్లీ కి కేసీఆర్ చాలా వెళ్లాడు.. కానీ ఒక సారి అయినా రైతు ఉద్య‌మాన్ని సంద‌ర్శించావా అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఢిల్లీ కి పొయిన ప్ర‌తి సారి ప్ర‌ధాని మోడీ గులాం గురి చేయ‌డానికే స‌మ‌యం కేటాయించావ‌ని మండి ప‌డ్డాడు. ఇప్పుడు రైతు చ‌ట్టాల‌కు మ‌ద్ధ‌త్తుగా మాట్లాడ‌టం హ‌స్య‌స్పందం అని అన్నాడు. కాగ తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ఆది వారం రాష్ట్ర బీజేపీ. సెంట్ర‌ల్ బీజేపీ వ్య‌వహారం పై మండి ప‌డుతు ప్రెస్ మీట్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.