ఇక ఎన్నికలు అయిపోయాయి కదా.. ఇప్పుడు ఏం పని ఉండదు.. అప్పటి వరకు ఖాళీగా ఉండటం ఎందుకు.. మళ్లీ సినిమాలు చేద్దామని పవన్ కల్యాణ్ భావిస్తున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా కోడై కూస్తున్నది.
జనసేన… మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ… ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్సార్సీపీలకు బాగానే గట్టి పోటీ ఇచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. మొన్న మొన్న వచ్చిన పార్టీ అయినా… పవన్ కు ఉన్న ఫ్యాన్స్ కారణంగా పార్టీకి కొంచెం హైప్ క్రియేట్ అయిన మాట వాస్తవమే.
అయితే.. పార్టీ పెట్టినప్పటి నుంచి… ఇప్పటి వరకు కూడా జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏదో ఒక దుష్ప్రచారం జరుగుతూనే ఉన్నది. ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి జనసైనికులు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ.. అది ఎందుకో వర్కవుట్ కావడం లేదు. అసత్యపు ప్రచారాలను మాత్రం జనసైన్యం ఆపలేకపోతోంది.
దానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే.. ఇక ఎన్నికలు అయిపోయాయి కదా.. ఇప్పుడు ఏం పని ఉండదు.. అప్పటి వరకు ఖాళీగా ఉండటం ఎందుకు.. మళ్లీ సినిమాలు చేద్దామని పవన్ కల్యాణ్ భావిస్తున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా కోడై కూస్తున్నది.
అయితే.. పవన్ తాను ఇక సినిమాల్లో నటించేది లేదని ఇంతకుముందే తన మనసులోని మాటను వెల్లడించారు. కాస్త గట్టిగానే చెప్పినా.. మళ్లీ సోషల్ మీడియాలో ఎవరో పవన్ త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారంటూ… ప్రచారం మొదలు పెట్టారు.
దేవుడా… పవన్ సినిమాల్లో నటించడం లేదు.. ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల మీదనే గడపబోతున్నారు. జనసేన అభిమానులు ఏమాత్రం భయాందోళనలకు గురి కావద్దు.. అంటూ ఆ పుకార్లుకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జనసైనికులు. ఇలా ఇదొక్క సారే కాదు.. ఇది వరకు కూడా చాలా సార్లు.. పవన్ పై లేనిపోని ఆరోపణలు రావడం.. ఆ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేయడానికి జనసైనికులు సతమతమవడం… ఎప్పుడూ జరిగేదే.