మెగాస్టార్ చిరంజీవికి షాక్.. వైసీపీలో చేరిన…!

-

ఎన్నికల వేళ మెగాస్టార్ చిరంజీవికి భారీ షాక్ తగిలింది. ఓవైపు చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి.. ఇప్పుడు ఎన్నికల్లో పోటీలో కూడా నిలిచారు. కానీ.. జనసేన నాయకులు మాత్రం పవన్ విధానాలు నచ్చక పార్టీని వీడుతున్నారు..

janasena leader raghava rao joins in ycp
మెగాస్టార్ చిరంజీవికి షాక్ తగిలింది. ఉత్తరాంధ్ర చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రెసిడెంట్, జనసేన నాయకుడు రాఘవరావు వైఎస్సార్సీపీలో చేరారు. ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనతో పాటు అనకాపల్లి మాజీ జెడ్పీటీసీ పూసపాటి భరత్ బాబు, డాక్టర్ బోని తాతారావు కూడా వైసీపీలో చేరారు.



విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగిన జగన్ సభలో వాళ్లు వైసీపీలో చేరారు. ఈసందర్భంగా జగన్ వాళ్లకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈసందర్భంగా మాట్లాడిన రాఘవరావు… టీడీపీ, జనసేన రెండూ ఒకటేనని.. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్నారు. ఓటర్లను పవన్ కల్యాణ్ మభ్యపెడుతున్నారని… పవన్ విధానాలు నచ్చకనే జనసేన నుంచి బయటికి వచ్చానని ఆయన తెలిపారు. తన అభిమానులను పవన్ మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రజకు మేలు చేకూరుస్తాయని.. జగన్ విధానాలు నచ్చే వైసీపీలో చేరినట్లు ఆయన తెలిపారు.
జనసేలోకి చిరు ఎంట్రీ..? పెద్ద తప్పిదానికి పవన్‌ సిద్దమా..?

janasena leader raghava rao joins in ycp

Read more RELATED
Recommended to you

Latest news