విశాల్, సుందర్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. ఇదివరకు వీళ్ల కాంబినేషన్ లో మదగజరాజా, ఆంబల లాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో మలయాళం స్టార్ ఐశ్వర్య లక్ష్మీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
హీరో విశాల్ కు షూటింగ్ లో ప్రమాదం జరిగింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. సుందర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో విశాల్ సరసన తమన్నా నటిస్తోంది. షూటింగ్ లో భాగంగా ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తుండగా… విశాల్ కింద పడ్డాడట. దీంతో ఆయన కాలు, చేయి విరిగినట్లు తెలుస్తోంది. కాలు, చేతికి బ్యాండేజ్ ఉన్న విశాల్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణాపాయం ఏమీ లేనప్పటికీ.. ఆయన కాలు, చేయి విరగడంతో షూటింగ్ కు కొన్నిరోజులు విరామం ఇవ్వాల్సిందేనని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.
విశాల్, సుందర్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. ఇదివరకు వీళ్ల కాంబినేషన్ లో మదగజరాజా, ఆంబల లాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో మలయాళం స్టార్ ఐశ్వర్య లక్ష్మీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
హీరో విశాల్ కు ఫైట్ సీన్లు ఎటువంటి డూప్ లేకుండా చేయడం అలవాటు. ఆయన గత చిత్రాలన్నింటిలోనూ విశాల్ ఫైట్ సీన్లలో నిజంగా నటిస్తారు. ఈ సినిమాకు కూడా విశాల్ ఎటువంటి డూప్ లేకుండా నటిస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ టర్కీలో 50 రోజులట. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో ఇంకా మూవీ యూనిట్ తెలియజేయలేదు.
అయితే.. వేసవి కానుకగా… విశాల్ నటించిన అయోగ్య సినిమా మే 10న రిలీజ్ కానుంది. తెలుగు సినిమా టెంపర్ కు రిమేక్ ఇది.