ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ శాఖల్లో చాలా కీలక మార్పులు జరిగాయి. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో ఏపీ సెక్రటేరియట్ లో ప్రముఖ అధికారులు బదిలీ కావటం అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో పని చేసిన అధికారులు వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పాల్పడినవారిని టార్గెట్ చేసి జగన్ సర్కార్ నానా ఇబ్బందులు పెడుతోందని అప్పట్లో వార్తలు గట్టిగా వినబడ్డాయి.
ఇటువంటి తరుణంలో చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డు సీఈఓగా పనిచేసిన జాస్తి కృష్ణ కిషోర్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వస్తున్న వేధింపులను తట్టుకోలేక తాను మాతృ సంస్థకు వెళ్ళిపోతానని రిలీజ్ చేయాలని కోరగా….జాస్తి కృష్ణ కిషోర్ అవినీతికి పాల్పడ్డారని రాత్రికి రాత్రి జగన్ సర్కార్ ఎంక్వయిరీ వేయడం జరిగింది. దీంతో విచారణ అయ్యేంతవరకు ఎక్కడ ఈ కథలో కూడదని ఆదేశాలు రావడంతో ఈ విషయం పై కృష్ణ కిశోరే క్యాట్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేసారు.
అయితే ఈ క్రమంలో కృష్ణ కిషోర్ కి ప్రభుత్వం జీతం కూడా చెల్లించకపోవడంతో క్యాట్ ట్రిబ్యునల్ ఏపీ సర్కార్ కి ట్విస్ట్ ఇచ్చేటట్లు షాక్ ఇవ్వటంతో వెంటనే జీవితం చెల్లింది. ఇటువంటి తరుణంలో తాజాగా ఒక నివేదిక వచ్చింది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు గత మూడేళ్లలో జరిపిన ఖర్చులో ఎటువంటి అవకతవకలు జరగలేదని అన్ని నియామకాలు అన్ని నిబంధనలు రూల్స్ ప్రకారమే జరిగాయని ఆడిట్ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏ నివేదిక రావటంతో జాస్తి కృష్ణ కిషోర్ వ్యవహారంలో జగన్ సర్కార్ కి క్యాట్ ట్రిబ్యునల్ మరో ట్విస్ట్ ఇచ్చినట్లయింది.