కవితకు ఈడీ వేడి.. రివర్స్‌ స్ట్రాటజీ స్టార్ట్..!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్..రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే..ఈ స్కామ్‌లో రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారని కథనాలు వచ్చాయి. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు, అరబిందో డైరక్టర్ శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ స్కామ్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వచ్చింది. అటు తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవిత పేరు ఎప్పటినుంచో వినిపిస్తుంది. తాజాగా మాత్రం ఆమె పేరుని ఈడీ రిపోర్టులో పేర్కొంది. ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా..సన్నిహితుడు అమిత్ అరోరాని తాజాగా ఈడీ అరెస్ట్ చేసింది.

ఇక ఆయన ఇచ్చిన రిపోర్టులో కవిత పేరు కూడా వచ్చింది. దీంతో కవితకు ఈడీ నోటీసులు ఇస్తుందని, ఆమెని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే రిమాండ్ రిపోర్టులో ఆమె పేరు ఉండటంతో..ఇప్పుడు ఈడీ ఏం చేస్తుంది..ఆమెకు నోటీసులు ఇస్తారా..విచారణ చేస్తారా..మొబైల్ ఫోన్లలో ఆధారాలు ధ్వంసం చేయడంపై ప్రశ్నిస్తారా? లేక అరెస్ట్ చేస్తారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

అయితే ఈడీ రిపోర్టులో కవిత పేరు రావడంతో..టీఆర్ఎస్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేస్తుంది. అసలు ఇదంతా బీజేపీ కక్షపూరితంగా చేస్తుందని రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. అటు కవిత సైతం అదే స్థాయిలో ఎటాక్ చేశారు. మోదీ వచ్చే ముందు ఈడీ రావడం కామన్ అని, కేసీఆర్‌ని దెబ్బతీయడానికే తనని టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. అలాగే తాను విచారణకు సిద్ధమని, అరెస్ట్ చేసుకున్నా పోయిదేమీ లేదని మాట్లాడుతున్నారు.

అంటే కవిత మాటలు చూస్తుంటే పక్కాగా రివర్స్ ఎటాక్‌లా ఉన్నాయి. అసలు స్కామ్‌లో వచ్చిన ఆరోపణలపై ఏ మాత్రం వివరణ ఇవ్వలేదు. పైగా బీజేపీ పని అని చెప్పి..ఓ రాజకీయ కక్షగా ఈ వ్యవహారాన్ని మార్చే ప్రయత్నం చేశారు. ఇకపై కూడా ఈడీ దూకుడు పెరిగితే.. కవితతో అదేవిధంగా రివర్స్ ప్లాన్ చేసి..బీజేపీపై మాటల దాడి చేయించడానికి రెడీ అవుతున్నారు. అలాగే కవితని ఇంకా రాజకీయంగా దూకుడు పెంచేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి లిక్కర్ స్కామ్ విషయంలో ఎదురుదాడి చేయడానికి టీఆర్ఎస్ సిద్ధమైంది.

Read more RELATED
Recommended to you

Latest news